పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, అక్టోబర్ 2011, గురువారం

సద్గురు నాథ సంకట హరణ సాయి దేవా!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !




ప.       సద్గురు నాథ సంకట హరణ సాయి దేవా!
          నీ తేజముకై హారతి ఇచ్చే సూర్య కిరణాలతో
          పత్రి గ్రామమున పుట్టిన దేవా నీకే హారతి                     | పత్రి |
          వెంకోసా గురు దీవెన లందిన నీకే హారతి                     | వెంకోసా |     || సద్గురు ||

చ.       షిరిడీలోనా మసీదు చేరిన సాయి హారతి
          నీటి దివ్వెలు వెలిగించిన నీ మహిమకు హారతులు         | షిరిడీ |
          సన్నుతించిన శరణము పొందిన సాయీ నీ కథా            | సన్నుతి |
          ఇహ పరమొసగే వరదుని కేమో దివ్య హారతి                | ఇహ పర |    || సద్గురు ||

చ.       పాదములందే పావన గంగను చూపిన దేవా!
          త్రివేణి సంగము తీర్థము ఇచ్చిన నీకే హారతి                 | పాదము |
          సత్య వాక్యమే నిత్యము నిలిపే షిరిడీ వాసము               | సత్య వాక్య |
          చల్లని చూపుల కన్నులు దాల్చెను చంద్ర కిరణాలను      | చల్లని |         || సద్గురు ||

చ.       భక్తుల కోసము ప్రాణము సైతము విడిచిన సాయి
          సమాధి నుండి సమాధానము వచ్చినదీ నిరతము         | భక్తుల |
          దత్త గరువుని చూడగోరిన గురునే చూపితివి                | దత్త |
          రాముని చూడగ భక్తుడు కోరిన నీలో నిలిపితివి             | రాముడు |    || సద్గురు ||

చ.       షిరిడీవాసా మృదు దరహాసా సాయిదేవా
          కోపము, తాపము రెండూ లేక చిందు చిరునవ్వులు       | షిరిడీ |
          శత్రులు మిత్రులు పరమపవిత్రులు సాయీ దయవుంటే    | శత్రులు |
          దుష్ట శిక్షణే చేయను నేనని కలిలో చాటితివి                  | దుష్ట |         || సద్గురు ||

చ.       జపమూ, తపమూ, నియమ-నిష్టలు లేనే లేవు
          పత్రీ, పుష్పము, ఫలమూ, నీరము ఇస్తే చాలంట            | జపమూ |
          చండక చండ మార్థాండునిచే మంగళ హారతీ                 | చండక |
          దైవశక్తికి, సత్కర్మమునకు నిరతము హారతి                 | దైవశక్తికి |     || సద్గురు ||

13, అక్టోబర్ 2011, గురువారం

షిరిడీ అదిగో బాబా అదుగో!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !




                                 గానం: శ్రీమతి శోభారాజ్    

                                 షిరిడీ అదిగో .....
                                 బాబా అడుగో........
                         ప.     షిరిడీ అదిగో, బాబా అడుగో (2)
                                 గలగలపారే గోదారదిగో
                                 కరుణామయుడగు షిరిడీ దేవుడు
                                 స్థిరముగ నిలిచిన ద్వారక అదిగో
                                 షిరిడీ అదిగో, బాబా అడుగో (2)
                 
                         చ.     గతిమతి తప్పిన కలియుగ జీవుల
                                 సతమత మణిచిన సద్గురువడుగో
                                 గతిమతి తప్పిన కలియుగ జీవుల
                                 సతమత మణిచిన సద్గురువడుగో
                                 శ్రద్ధా, సహనముల కాలవాలమగు
                                 శ్రితజన సేవిత పాదుకలవిగో
                                 శ్రితజన సేవిత పాదుకలవిగో..
                                 షిరిడీ అదిగో, బాబా అడుగో (2)

                         చ.     భగభగ మండే ధుని అదిగో మన
                                 అహములు హరించు చావడి అదిగో
                                 భగభగ మండే ధుని అదిగో మన
                                 అహములు హరించు చావడి అదిగో
                                 జగములనేలే సాయి సద్గురుని
                                 నగవులు పూచిన సుమవనమదిగో
                                 నగవులు పూచిన సుమవనమదిగో..
                                 షిరిడీ అదిగో, బాబా అడుగో (2)
                                 గలగలపారే గోదారదిగో
                                 కరుణామయుడగు షిరిడీ దేవుడు
                                 స్థిరముగ నిలిచిన ద్వారక అదిగో
                                 షిరిడీ అదిగో, బాబా అడుగో (4)

15, సెప్టెంబర్ 2011, గురువారం

ఎంతెంత దయ నీది ఓ! సాయి!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!


చిత్రం: శ్రీ సాయి మహిమ
రచన: సి.నారాయణ రెడ్డి
గానం: అనురాధ పోడువాల్
సంగీతం: ఆదిత్య పోడువాల్
    
                  ప.     ఎంతెంత దయనీది ఓ సాయి
                          ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను
                          ఏమని పొగడను సర్వాంతర్యామి                  || ఎంతెంత ||
                          ఎంతెంత దయనీది ఓ సాయి

                  చ.     తొలగించినావు వ్యాధులు ఊదితో
                          వెలిగించినావు దివ్వెలు నీటితో                    |  తొలగించి  |
                          నుడులకు అందవు నుతులకు పొంగవు         | నుడులకు |
                          పాపాలు కడిగేసే పావన గంగవు                  || ఎంతెంత ||

                  చ.     భక్త కబీరే నీ మతమన్నావు
                          భగవానుడే నీ కులమన్నావు                    | భక్త కబీరే |
                          అణువున నిండిన బ్రహ్మాండంలా
                          అందరిలో నీవే కొలువున్నావు                    || ఎంతెంత ||

                  చ.     ప్రభవించినావు మానవమూర్తివై
                          ప్రసరించినావు ఆరని జ్యోతివై                     | ప్రభవించి |
                          మారుతి నీవే గణపతి నీవే
                          సర్వ దేవతల నవ్యాకృతి నీవే                     || ఎంతెంత ||

                          బాబా సాయిబాబా, బాబా సాయిబాబా
                          బాబా ఆఆఆఅ..షిరిడి బాబా..

25, ఆగస్టు 2011, గురువారం

మా పాపాల తొలగించు దీపాల నీవే - సాహిత్యం, వీడియో

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!

చతుర్విధ పురుషార్థాలకు వర్ణ భేదాలు లేకుండా ఎక్కడ మార్గాలు తెరిచి ఉంటాయో అదే ద్వారక. 
ఈ ద్వారకామయి మీదే. 
మీ కోసమే నేను.
 భగవాన్ సాయినాథ్ కి జై!
    భగవాన్ సాయినాథ్ కి జై! 



పాట:   మా పాపాల తొలిగించు
రచన: వేటూరి 
గానం:  జేసుదాసు
చిత్రం:   శ్రీ షిరిడి సాయిబాబా మహాత్మ్యం

ప.       మా పాపాల తొలిగించు దీపాల నీవే వెలిగించినావయ్యా 
          మమ్ము కరుణించినావయ్యా
          జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను
          దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా                       ||మా పాపాల||

చ.       పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని
          వాడు పరిశుద్ధుడౌతాడని
          గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ! సాయీ
          మమ్ము సాకావు మా సాయీ
          వాసన్లు వేరైనా, వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి
          నిన్ను పూజించ తగునంటివి
          మా తడి లేని హృదయాల దయతోటి తడిపి
          తలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి                        ||మా పాపాల||

చ.       పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
          ఇచ్చు మేలైన పై జన్మం
          రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయా
          వారి బాధల్ని మోసావయా
          ఏనాడు పుట్టావో, ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
          నువ్వు ఏనాటి దైవానివో
          ఈ ద్వారకామాయి నివాసమాయే
          ధన్యులమైనామయా, మాకు దైవమై వెలిశావయా                      ||మా పాపాల||

          తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
          తరియించినామయ్యా మేము తరియించినామయ్యా

శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కి జై!

4, ఆగస్టు 2011, గురువారం

సాయీ శరణం బాబా శరణం శరణం

సాయీ శరణం బాబా శరణం శరణం



హే! పాండురంగా! హే! పండరి నాథా!
శరణం  శరణం  శరణం

ప. సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
    ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే  (2)       
    సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం గంగా యమున సంగమ సమానం

చ. విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
    పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై
    తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై
    మహల్సా, శ్యామాకు మారుతి గాను మరి  కొందరికి దత్తాత్రేయుడుగా
    యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేసాడు                                 "సాయీ"

చ. పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను, ఆదరించె తాననాథ నాథుడై
    అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి, అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
    వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను, పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై
    పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసుకొనెను, దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై
    అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో, ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై
    జీవరాశులన్నిటికి సాయే శరణం, సాయే శరణం
    విద్య దాన సాధనకు సాయే శరణం, సాయే శరణం
    ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం (2)
    భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం (2)                                            "సాయీ"

23, జూన్ 2011, గురువారం

ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!


గానం: మాధవపెద్ది రమేష్

ప. ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం (2)
    శాంతి మంత్రం సాయిరాం శక్తిపీఠం సాయిరాం (2)
    ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం (2)

చ. బ్రహ్మతేజం సాయిరాం సృష్టిమూలం సాయిరాం (2)
    జ్ఞానతేజం సాయిరాం రాజయోగం సాయిరాం (2)
    ఆనందసారం సాయిరాం అద్వైతరూపం సాయిరాం (2)
    ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం (2)

చ. వేదనాదం సాయిరాం లోకదీపం సాయిరాం (2)
    దీనబంధూ సాయిరాం ప్రేమసింధూ సాయిరాం (2)
    ప్రశాంతినిలయం సాయిరాం అనంతవిజయం సాయిరాం (2)

    ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం (2)
    శాంతి మంత్రం సాయిరాం శక్తిపీఠం సాయిరాం (2)

క్రింది లింకు క్లిక్ చేసి పాట వినవచ్చును