20, అక్టోబర్ 2011, గురువారం

సద్గురు నాథ సంకట హరణ సాయి దేవా!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !




ప.       సద్గురు నాథ సంకట హరణ సాయి దేవా!
          నీ తేజముకై హారతి ఇచ్చే సూర్య కిరణాలతో
          పత్రి గ్రామమున పుట్టిన దేవా నీకే హారతి                     | పత్రి |
          వెంకోసా గురు దీవెన లందిన నీకే హారతి                     | వెంకోసా |     || సద్గురు ||

చ.       షిరిడీలోనా మసీదు చేరిన సాయి హారతి
          నీటి దివ్వెలు వెలిగించిన నీ మహిమకు హారతులు         | షిరిడీ |
          సన్నుతించిన శరణము పొందిన సాయీ నీ కథా            | సన్నుతి |
          ఇహ పరమొసగే వరదుని కేమో దివ్య హారతి                | ఇహ పర |    || సద్గురు ||

చ.       పాదములందే పావన గంగను చూపిన దేవా!
          త్రివేణి సంగము తీర్థము ఇచ్చిన నీకే హారతి                 | పాదము |
          సత్య వాక్యమే నిత్యము నిలిపే షిరిడీ వాసము               | సత్య వాక్య |
          చల్లని చూపుల కన్నులు దాల్చెను చంద్ర కిరణాలను      | చల్లని |         || సద్గురు ||

చ.       భక్తుల కోసము ప్రాణము సైతము విడిచిన సాయి
          సమాధి నుండి సమాధానము వచ్చినదీ నిరతము         | భక్తుల |
          దత్త గరువుని చూడగోరిన గురునే చూపితివి                | దత్త |
          రాముని చూడగ భక్తుడు కోరిన నీలో నిలిపితివి             | రాముడు |    || సద్గురు ||

చ.       షిరిడీవాసా మృదు దరహాసా సాయిదేవా
          కోపము, తాపము రెండూ లేక చిందు చిరునవ్వులు       | షిరిడీ |
          శత్రులు మిత్రులు పరమపవిత్రులు సాయీ దయవుంటే    | శత్రులు |
          దుష్ట శిక్షణే చేయను నేనని కలిలో చాటితివి                  | దుష్ట |         || సద్గురు ||

చ.       జపమూ, తపమూ, నియమ-నిష్టలు లేనే లేవు
          పత్రీ, పుష్పము, ఫలమూ, నీరము ఇస్తే చాలంట            | జపమూ |
          చండక చండ మార్థాండునిచే మంగళ హారతీ                 | చండక |
          దైవశక్తికి, సత్కర్మమునకు నిరతము హారతి                 | దైవశక్తికి |     || సద్గురు ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి