భక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, ఆగస్టు 2011, బుధవారం

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు


శ్రద్ధ!                                                             సబూరి! 

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే 
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం 
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే
   
 గణేశ శరణం శరణం గణేశ
   వాగీశ శరణం శరణం వాగీశ 
   సాయీశ శరణం శరణం సాయీశ

11, ఆగస్టు 2011, గురువారం

Everybody Loves Sai, Sai Loves Everybody





సాయి సాయి సాయి సాయి    బాబా సాయి సాయి సాయి
సాయి సాయి సాయి సాయి    బాబా సాయి సాయి సాయి
ప్యార్ కరే సబ్ సాయి సే సాయి సబ్ సే ప్యార్ కరే -2

Everybody Loves Sai, Sai Loves Everybody -2
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయి
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ షిరిడీ వాలే సాయి
ప్యార్ కరే సబ్ సాయి సే సాయి సబ్ సే ప్యార్ కరే -2
ఖాలీ ఝోలీ భర్తా సాయి కర్తా మురాదె పూరి సాయి - 2
కర్తా మురాదె పూరి సాయి

Everybody Loves Sai, Sai Loves Everybody -2
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయి
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ షిరిడీ వాలే సాయి
ప్యార్ కరే సబ్ సాయి సే సాయి సబ్ సే ప్యార్ కరే -2
ఇస్ యుగ్ మేం సాయి ఆయా హై, గీతా కా వచన్ నిభాయా హై-2
గీతా కా వచన్ నిభాయా హై

Everybody Loves Sai, Sai Loves Everybody -2
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయి
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ షిరిడీ వాలే సాయి
ప్యార్ కరే సబ్ సాయి సే సాయి సబ్ సే ప్యార్ కరే -2
యే కహె సాయి కితనె పుజారి, ఇస్ సాయి పర్ యుగ్ బలిహారి -2
 ఇస్ సాయి పర్ యుగ్ బలిహారి

Everybody Loves Sai, Sai Loves Everybody -2
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయి
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ షిరిడీ వాలే సాయి
ప్యార్ కరే సబ్ సాయి సే సాయి సబ్ సే ప్యార్ కరే -2

Everybody Loves Sai, Sai Loves Everybody -2
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయి
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ షిరిడీ వాలే సాయి
సాయి సాయి సాయి సాయి    బాబా సాయి సాయి సాయి
సాయి సాయి సాయి సాయి    బాబా సాయి సాయి సాయి 

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!!

6, జనవరి 2011, గురువారం

ఆంగ్లం లో సాయి సచ్చరిత్ర సారాంశము

 ప్రియమైన సాయి భక్తులకు,

      ఇదివరకు శ్రీ సూర్య ప్రకాశ రావు గారు రచించిన "శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము" ను నా బ్లాగు ద్వారా ప్రచురించే భాగ్యం కలిగింది. తదుపరి పలువురు సాయి భక్తులు ఈ అమూల్య రచనను ఆంగ్లము లోనికి అనువదించ వలసినదిగా కోరడం జరిగింది. వారి ప్రోత్సాహంతో, సాయి కృపతో ఈ చిన్న రచనను ఆంగ్లం లోకి అనువదించడం జరిగింది. ఇదంతా సాయి ఆశీస్సులుగా భావిస్తున్నాను.  

      ఈ ఆంగ్ల అనువాదం దిగువన యివ్వ బడిన web site లో post చేయబడింది. 
http://shiridisaisv.blogspot.com/
దయచేసి సాయి భక్తులైన మీ మిత్రులకు, బంధువులకు ఈ వివరము తెలియజేయగలరు. అంతే కాకుండా ఈ Web site ను ఈ page లోని "నా బ్లాగులు" క్రింద గల "Shirdi Sai" ను click చేసిన యెడల కూడా English Blog కు పోగలరు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై!

29, డిసెంబర్ 2010, బుధవారం

ఆంగ్లంలో సాయి సచ్చరిత్ర సారాంశము

 ఓం శ్రీ సాయి నాథాయ నమః 
శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము పారాయణ నేటితో పూర్తి అయి రేపటి తుది పలుకు తో పరి సమాప్తి అవుతుంది. చాల మంది సాయి భక్తులు దీనిని ఆంగ్లం లోకి అనువదించ వలసినదిగా కోరడం వలన, ఈ "శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము యొక్క ఆంగ్ల అనువాదాన్ని ఈ రోజు నుండి పోస్ట్ చేస్తున్నాను. 
English blog URL: http://shiridisaisv.blogspot.com
దయచేసి ఆసక్తులైన సాయి భక్తులకు ఈ విషయము తెలియ చేయగలరు.

20, డిసెంబర్ 2010, సోమవారం

నూటొక్క సంవత్సరాల క్రిందట కదిలింది శ్రీ సాయి పల్లకి

షిరిడీ లో ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం జరుగుతుంది. అది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ సాయి ద్వారకామాయి నుండి బయలుదేరి చావడి వరకు ఊరేగింపుగా భక్తులతో కలసి తప్పెటలు, తాళాలు, బాజాల మ్రోతల మధ్యన పల్లకి వెనుకగా చిందులు వేస్తూ ఈ పల్లకి ఉత్సవం లో పాల్గొనేవారు.
     అసలీ ఉత్సవం ఎలా ప్రారంభమైందంటే,  షిరిడీలో ఒకసారి భారీ వర్షాల వలన ద్వారకామాయి లోకి బాగా నీళ్ళు వరదలా వచ్చేసాయి. అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి ఏ మాత్రం పొడి జాగా లేదు. అప్పుడు భక్తులంతా బాబాను చావడికి తరలించారు. మరునాడు ఉదయం బాబా మామూలుగా ద్వారకామాయి తిరిగివచ్చారు.  అప్పటినుండి బాబా రోజు విడిచి రోజు ద్వారకామాయిలోను, చావడిలోను నిద్రిస్తుండేవారు. ఇది డిశంబరు 10, 1909 లో జరిగింది. అంటే ప్రస్తుతానికి దాదాపు 101 ఏళ్ళముందు జరిగిందన్నమాట. ఆరోజు నుండి బాబా ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే ఊరేగింపుని "పల్లకి ఉత్సవం" లేదా "చావడి ఉత్సవం" గా అందరు సాయి భక్తులు ప్రతి గురువారం సంప్రదాయ బద్ధంగా చేయనారంభించారు. ఈ ఉత్సవంలో మేళతాళాల మధ్య మహాశివుని లా చిందులు వేస్తూ బాబా తరలివస్తారు. బాబా పాదుకలను పల్లకీలో ఉంచుతారు. బాబా కు బహూకరించిన గుర్రం "శ్యామకర్ణ" ను అలంకరించి తెచ్చేవారు. తాత్యా, మహల్సాపతి, బాబాకు చెరొక ప్రక్క నడవగా, తదితర భక్తులంతా కలసి పల్లకి ఉత్సవంలో పాల్గొనేవారు. 
      ఇప్పటికీ షిరిడీ లో ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. దేశ విదేశాల నుండి ప్రతి ఏటా షిర్డీ వచ్చే భక్తులు తప్పక ఈ ఉత్సవాన్ని చూసి వెళతారు. ఈ పల్లకి ఉత్సవం పై శ్రీ సి.నారాయణ రెడ్డి గారు "సాయి మహిమ" అనే చిత్రం కోసం "కదిలింది శ్రీ సాయి పల్లకి" అనే ఈ పాట తో కలిపి అన్ని పాటలను వ్రాసారు. ఆ పాట సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను. ఈ పాటలో పల్లకి ఉత్సవాన్ని కవి గారు చాల చక్కగా వర్ణించారు. ఈ పాటను బాలు, జానకి బృందం గానం చేసారు.




ప. కదిలింది శ్రీ సాయి పల్లకి 
     కరుణామయుని  పూల పల్లకి
     అది శుభ కారిణి ఆత్మ విహారిణి
     ఆనంద పద సంచారిణి                        || కదిలింది ||
     సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
     జయ జయ సాయి సాయి హరే హరే !

చ. సాయి పాదుకలు ఎదపై నిలిపి (2)
     సాగెను పల్లకి నేడు 
     పల్లకి వెంటా చల్లగా కదిలెను
     బాబా పదములు చూడు (2)              || కదిలింది ||
     సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
     జయ జయ సాయి సాయి హరే హరే !

చ. ద్వారక దాటి తరలిన పల్లకి (2)
     చేరెను చావడి ముందు 
     ప్రమథుల నడుమా పరమ శివునిలా
     బాబా వేసెను చిందు (2)                     || కదిలింది ||
     సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
     జయ జయ సాయి సాయి హరే హరే !

చ. అటు తాళాలు, యిటు మేళాలు
     ఆడే భక్త గణాలు (2)
     పల్లకి ఉత్సవం చూసిన చాలు
     కరుగును పాషాణాలు (2) ||కదిలింది ||
     సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
     జయ జయ సాయి సాయి హరే హరే !

నార్త్ కరోలినా (అమెరికా) లోని "ట్రయాంగిల్ సాయి సత్సంగ్" కు చెందిన సాయి భక్తులు ఈ పల్లకి ఉత్సవాన్ని పై పాటతో అభినయించిన వీడియో ఈ దిగువన ఇవ్వబడిన లింకు లో ఉంది. 
http://www.youtube.com/watch?v=GjYtDoozsCU