22, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - ముందు మాట

 శ్రీ షిరిడి సాయి సచ్చరిత్రను శ్రీ హేమాదు పంత్ వ్రాయగా షిరిడీ సంస్థాన్ వారు దానిని వివిధ భాషలలో అనువదించి ప్రచురించారు.  ఈ గ్రంథమును పారాయణము చేయని సాయి భక్తులు బహుశా ఉండరు.  ఒకసారి మా మిత్రుని మామగారైన శ్రీ సి.హెచ్.సూర్య ప్రకాశరావు గారు (విశాఖపట్నం వాస్తవ్యులు) అమెరికా సందర్శించినపుడు  వారి సాంగత్యం లభించింది. వారు సాయి భక్తులు.  వారితో కలసి గడిపిన కొద్ది రోజులు మరువ రానివి.  శ్రీ సాయి గురించి వారి అనుభవాలను విని పులకించి పోయాము. శ్రీ సూర్య ప్రకాశ రావు గారు తమ అపార అనుభవము తో బృహత్తరమైన  శ్రీ సాయి సచ్చరిత్రను క్లుప్తముగా "శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము" అను చిన్న రచన చేసి 2010 గురుపూర్ణిమ దినాన సాయి భక్తులకు వినిపించారు. వారి కోరిక మీద (నా అదృష్టము వలన) వారి రచనను చిన్న పుస్తక రూపములో ఆవిష్కరించారు. శ్రీ సూర్య ప్రకాశ రావు గారి అనుమతి పై వారి రచనను యథా తధంగా ఈ 'సాయి వాణి' ద్వారా ప్రపంచ గవాక్షం నుండి అందరు సాయి భక్తులకు అందిస్తున్నాను. ఈ "సాయి సచ్చరిత్ర సారాంశము" ను గురువారం ప్రారంభించి ఏడు రోజుల పారాయణము గా ప్రచురిస్తున్నాను.  గమనించ గలరు. ఇది కేవలం సాయి ఆశీర్వాదం అని నా భావన. -సాయి భక్తుడు సూర్య నారాయణ.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! 


శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము
ముందుమాట

పాఠకులకు విజ్ఞప్తి:
శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము అను ఈ చిన్న పుస్తకమును వ్రాయుటకు ముఖ్య ఉద్దేశ్యము:

    నేను 1984 వ సంవత్సరం ఒంగోలు (ఆం.ప్ర., ఇండియా) లో నాగార్జునసాగర్ లో సివిల్ ఇంజనీరుగా పని చేయుచున్నపుడు లాయర్ పేటలో ఉన్న షిరిడీ సాయి మందిరం దర్శించడం, ఎక్కిరాల భరద్వాజ గార్ని దర్శించడం, షిరిడీ పుణ్యక్షేత్ర దర్శనం జరిగాయి. అటుపైన సాయికృప నాపైన, నా కుటుంబం పైన ధారాపాతంగా వర్షించబడినది.  అప్పటి నుండి సాయిసేవలో వెనుదిరగలేదు. నా అనుభవములు కోకొల్లలు.


    నేను ఎందరో వ్రాసిన శ్రీ సాయిసచ్చరిత్ర గ్రంథములు పారాయణ చేసితిని. మూల గ్రంథములో యున్న సంతృప్తి మిగిలిన గ్రంథములు యివ్వలేదు. అప్పటినుండి శ్రీ సాయి సచ్చరిత్ర మూలగ్రంథమును (షిరిడి సాయి సంస్థాన్) క్లుప్తీకరించాలని అనేక సారులు షిరిడీ వెళ్ళినపుడు శ్రీ సాయిని కోరేవాడిని. కారణం ప్రస్తుత కాల మాన పరిస్థితుల ప్రకారం ఈ యంత్రయుగంలో 350 పేజీల మూలగ్రంథమును పారాయణ చేయుట భక్తులకు వీలుపడుటలేదు.
 

    అందువలన మూలమును మార్చకుండా సాయి అనుగ్రహంతో సచ్చరిత్ర సారాంశమును-సాయి సందేశము అను ఈ చిన్న పుస్తక రూపంలో మీకు అందించడమైనది. ఇది నా పూర్వజన్మ సుకృతముగా భావించుచున్నాను.

    సాయి లీలలు అనంతము. ఎవరికి అంతుపట్టనివి. నేను అమెరికా రావడము, మా అమ్మాయి యింట్లో 25 జూలై 2010 గురు పౌర్ణమి ఉత్సవము జరగడము, ఈ చిన్న పుస్తకమును ఆవిష్కరించి సాయి సందేశమును భక్తులకు వినిపించడం, భక్తులు ఎంతో సంతసించి వివిధ భాషలలో ప్రతులను కోరడం జరిగింది. నిజంగా సాయి లీలగాక మరేమిటి.
 

    మీరందరూ భక్తి, శ్రద్ధలతో ఈ చిన్న పుస్తకమును పారాయణ చేయుచు, శ్రీ షిరిడీ సాయి కృపకు పాత్రులు అవాలని కోరుకొనుచున్నాను.

శ్రీ సాయికి సర్వస్య శరణాగతుడను.
మీ సాయి భక్తుడు
సిహెచ్. కె. సూర్యప్రకాశరావు
విశాఖపట్నం

6 కామెంట్‌లు:

 1. Pls visit my blog www.saiabhay2000.blogspot.com and give your valuable feed back.

  రిప్లయితొలగించండి
 2. సాయి అభయ్ గారికి, నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు. మీ షిరిడీసాయి లీలామృతం చదివాను. చాల బాగా నిర్వహిస్తున్నారు. మీరు చదవబోయే 'సాయిసచ్చరిత్ర సారాంశమూ క్లుప్తమైనది. రేపటి నుండి నిత్య పారాయణగా 7 రోజులు వస్తుంది.

  రిప్లయితొలగించండి
 3. సూరి గారు,
  ఈ సంక్షిప్త సాయి చరిత్ర చాలా బాగుంది. మీ బ్లాగు ద్వారా అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
  ~మురళి సగిలి

  రిప్లయితొలగించండి
 4. మురళి గారు, ధన్యవాదాలు. అంతా సాయి ఆశీస్సులే. నేను నిమిత్తమాత్రుణ్ణి.

  రిప్లయితొలగించండి
 5. Surya Gariki,
  Namaskaralu.Meeru vrasina Sai sankshipta parayanam chala chala bagundi.
  Meeku veelu ithe naku oka prathini pampisthara?

  Naaemail ki---
  vinodini24@yahoo.com.

  Dhanyavadhalu,
  Vinodini

  రిప్లయితొలగించండి
 6. జై సాయి సమర్దా
  మీ అనుభవం మాకు సాయి లీలే. అత్యధ్బుతంగా రాశారు.
  జై సాయిరాం
  ఇందిరా బాలాజీ రావు
  శ్రీ సాయి ధ్యాన సత్సంగ్
  నెల్లూరు

  రిప్లయితొలగించండి