శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !
గానం: శ్రీమతి శోభారాజ్
షిరిడీ అదిగో .....
బాబా అడుగో........
ప. షిరిడీ అదిగో, బాబా అడుగో (2)
గలగలపారే గోదారదిగో
కరుణామయుడగు షిరిడీ దేవుడు
స్థిరముగ నిలిచిన ద్వారక అదిగో
షిరిడీ అదిగో, బాబా అడుగో (2)
చ. గతిమతి తప్పిన కలియుగ జీవుల
సతమత మణిచిన సద్గురువడుగో
గతిమతి తప్పిన కలియుగ జీవుల
సతమత మణిచిన సద్గురువడుగో
శ్రద్ధా, సహనముల కాలవాలమగు
శ్రితజన సేవిత పాదుకలవిగో
శ్రితజన సేవిత పాదుకలవిగో..
షిరిడీ అదిగో, బాబా అడుగో (2)
చ. భగభగ మండే ధుని అదిగో మన
అహములు హరించు చావడి అదిగో
భగభగ మండే ధుని అదిగో మన
అహములు హరించు చావడి అదిగో
జగములనేలే సాయి సద్గురుని
నగవులు పూచిన సుమవనమదిగో
నగవులు పూచిన సుమవనమదిగో..
షిరిడీ అదిగో, బాబా అడుగో (2)
గలగలపారే గోదారదిగో
కరుణామయుడగు షిరిడీ దేవుడు
స్థిరముగ నిలిచిన ద్వారక అదిగో
షిరిడీ అదిగో, బాబా అడుగో (4)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి