శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!
చతుర్విధ పురుషార్థాలకు వర్ణ భేదాలు లేకుండా ఎక్కడ మార్గాలు తెరిచి ఉంటాయో అదే ద్వారక.
ఈ ద్వారకామయి మీదే.
మీ కోసమే నేను.
భగవాన్ సాయినాథ్ కి జై!
భగవాన్ సాయినాథ్ కి జై!
పాట: మా పాపాల తొలిగించు
రచన: వేటూరి
రచన: వేటూరి
గానం: జేసుదాసు
చిత్రం: శ్రీ షిరిడి సాయిబాబా మహాత్మ్యం
ప. మా పాపాల తొలిగించు దీపాల నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా ||మా పాపాల||
చ. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్ధుడౌతాడని
గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ! సాయీ
మమ్ము సాకావు మా సాయీ
వాసన్లు వేరైనా, వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడి లేని హృదయాల దయతోటి తడిపి
తలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి ||మా పాపాల||
చ. పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయా
వారి బాధల్ని మోసావయా
ఏనాడు పుట్టావో, ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నివాసమాయే
ధన్యులమైనామయా, మాకు దైవమై వెలిశావయా ||మా పాపాల||
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కి జై!
Thank you very much..about In this posting.
రిప్లయితొలగించండిYou are welcome.
రిప్లయితొలగించండిసాహిత్యం పోస్ట్ చేసినందుకు నెనర్లు.
రిప్లయితొలగించండిఈ పాట రాసినవారు వేటూరి గారు.ఆయన పేరుకూడా పోస్ట్‌లో పెట్టండి :)
భాస్కర్ గారికి ధన్యవాదాలు. వేటూరి గారి పేరు చేర్చాను.
రిప్లయితొలగించండి