శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!
చిత్రం: శ్రీ సాయి మహిమ
రచన: సి.నారాయణ రెడ్డిగానం: అనురాధ పోడువాల్
సంగీతం: ఆదిత్య పోడువాల్
ప. ఎంతెంత దయనీది ఓ సాయి
ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను
ఏమని పొగడను సర్వాంతర్యామి || ఎంతెంత ||
ఎంతెంత దయనీది ఓ సాయి
చ. తొలగించినావు వ్యాధులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితో | తొలగించి |
నుడులకు అందవు నుతులకు పొంగవు | నుడులకు |
పాపాలు కడిగేసే పావన గంగవు || ఎంతెంత ||
నుడులకు అందవు నుతులకు పొంగవు | నుడులకు |
పాపాలు కడిగేసే పావన గంగవు || ఎంతెంత ||
చ. భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు | భక్త కబీరే |
అణువున నిండిన బ్రహ్మాండంలా
అందరిలో నీవే కొలువున్నావు || ఎంతెంత ||
చ. ప్రభవించినావు మానవమూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై | ప్రభవించి |
మారుతి నీవే గణపతి నీవే
సర్వ దేవతల నవ్యాకృతి నీవే || ఎంతెంత ||
బాబా సాయిబాబా, బాబా సాయిబాబా
బాబా ఆఆఆఅ..షిరిడి బాబా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి