ప. విన్నపాలు విన్నవించ వచ్చినాము బాబా
కన్న తల్లి తండ్రి నీవే సాయిబాబా
మా సాయిబాబా మా సాయిబాబా ||విన్న||
చ. మురిపెము తో నువు తిరిపెము నెత్తి మురిసినావు బాబా
కరములతో శ్రీకరముగ మమ్ము బ్రోచినావు బాబా ||మురి||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
చ. కరి మొరలే విని మకరిని ద్రుంచిన వాడవు కావా బాబా
మా మొరలే వినరావా బాబా ఓ సాయిబాబా ||కరి||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
చ. రావణంతకా ఇనకుల తిలకా రామ సాయిబాబా
దశరథ పుత్ర కోమల గాత్రా పరమ పవిత్రా బాబా ||రావ||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
విన్నపాలు విన్నవించ వచ్చినాము బాబా
కన్న తల్లి తండ్రి నీవే సాయిబాబా
మా సాయిబాబా మా సాయిబాబా
రాముడికి కృష్ణుడికి సాయిబాబాకి కనెక్షన్ ఏంటి మేష్టారు?
రిప్లయితొలగించండిసాయిబాబా మీ కన్న తల్లో తండ్రో ఎలా అవుతారు సారూ?
ఈ భక్తి, ప్రేమ, నమ్మకం, విశ్వాసం మనందరం తోటి మనుషుల మీద చూపితే.....
అజ్ఞాత వ్యక్తి గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. శ్రీ షిరిడిసాయిబాబా గారు కొందరు భక్తులకు రామునిగా, కృష్ణునిగా, మారుతిగా, దత్తాత్రేయునిగా దర్శనమిచ్చారు. వారి వారి స్పందనను బట్టి అలా దర్శనమిచ్చారు. భక్తులు ఆయనను ఆయా పేర్లతో పిలుచుకున్నారు. షిరిడీ సాయి బాబా చాల సామాన్య జీవితం గడిపారు. రెండే రెండు పంచలతో ఒకటి కట్టుకుంటే ఒకటి ఉతుక్కుని కాలం గడిపారు. ఆయన ఎప్పుడూ కాషాయం కట్టి తనకు కోవెల కట్టమని చెప్పలేదు. ఆయన అడిగినది శ్రద్ధ, సహనము అనే రెండు రూపాయలు. తనకు భక్తులు ప్రేమతో సమర్పించిన కానుకలను ఏ రోజుకారోజు సాయంత్రం అయేటప్పటికి అందరికీ పంచేసే వారు. మీరు ఆఖరున వ్రాసినదే ఆయన చెప్పారు..ప్రేమ, భక్తి, నమ్మకం, విశ్వాసం. అన్ని జీవులలో భగవంతుని చూడమన్నారు. మన ఊహకు భగవంతుడు ఎలా తోస్తే అలా కనిపిస్తాడు-ఒక అవతార పురుషుడైన రామునిగా, కృష్ణునిగా, అవధూతగా, యోగిగా, తల్లిగా, తండ్రిగా.. ఎలా అనుకుంటే అలా. రూపం అనేది మనకు గురి కుదరడానికి లేదా మన శ్రద్ధను కేంద్రీకృతం చేయడానికి ఊహించుకొనేది. ఊహను నియంత్రించగలిగిన వారు ఆయను నిరాకారుడైన పరబ్రహ్మగా చూడగలరు. అన్నమాచార్య కూడ "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు" అన్నాడు. విష్ణువుగా, శివునిగా, పరబ్రహ్మగా, భైరవునిగా ఇలా ఒకటేమిటి ఇది మన సృజనాత్మకతపై ఆధారపడి వుంటుంది. మన బాధలను తీర్చేది తల్లిడండ్రులు అయినప్పుడు ఆయనను ఆ రూపంలో నైనా చూడ వచ్చును. ఆఖరుగా, నేను పోస్టు చేసిన ఈ పాట నా రచన కాదు. ఒక సీడీ లో విని, అందులోని భావం నచ్చి కొందరు సాయి భక్తులు కోరగా పోస్టు చేసాను. మీ సందేహాలకు నేను పూర్తి సమధానం ఇచ్చానో లేదో తెలియదు. కాని నాకు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండి