సద్గురు సాయినాథుడు |
శ్రీ బండారు చిట్టిబాబు |
రచన: వరద రాజు
గానం: శ్రీమతి ఎస్.జానకి
శ్రీ బండారు చిట్టిబాబు గారు శ్రీకాకుళం వాస్తవ్యులు, ప్రముఖ సంగీత దర్శకులు. వారు ఎన్నో ఆధ్యాత్మిక గీతాలకు సుమధురమైన, సుస్వరమైన బాణీలు కట్టారు. స్థానికంగా అరసవిల్లి లో వెలసిన శ్రీ సూర్య నారాయణ స్వామి వారి పై, అయ్యప్ప స్వామి పై ఇలా ఎందఱో దేవుళ్లపై భక్తీ గీతాలకు చక్కని సంగీతాన్ని అందించారు. అంటే కాక, శ్రీ చిట్టి గారు బాబా భక్తులు. చాల సంవత్సరాల క్రితం వారు సత్యసాయి పై తీసిన "సుధా బిందువులు" అను చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. వారి మరొక ఆల్బం శ్రీ షిరిడీ సాయినాథుని పై "సాయి సేవలో". ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన పాట, అందులోనూ నాకు నచ్చినది శ్రీమతి ఎస్. జానకి గారు ఆలపించిన "ముడి వేయవేమి". ఈ పాట వింటుంటే ఆ మహా గాయని ఎంత ఆర్తి తో పాడిందో అర్ధమౌతుంది. ఈ పాట విన్నపుడు నా కళ్ళు అశ్రు పూరితాలవుతాయి ఎప్పుడూ. దీనిని వరద రాజు గారు వ్రాస్తే, చక్కని, మరపురాని బాణీ కట్టి ధన్యులయ్యారు శ్రీ చిట్టిబాబు గారు. ఆ పాట సాహిత్యం మరియు ఆడియో లింకును దిగువన ఇస్తున్నాను. విని సాయి సేవలో మునిగిపొండి.
ప. ముడి వేయవేమి నా మనసు నీ చెలిమి
అల వోలె ఎగసెగసి అదుపు లేదో సాయి
కోవెలకు చేరి నీ పాదాల వాలనీ
ఏ పూలమాలగా వాడినా ఒరిగినా "ముడి"
చ. ఏడేడు లోకాలు యేలేటి దొరయని
ఈ జాజి పూలన్ని శృతి కలిపి పాడాయి "ఏడేడు"
కులమేల మతమేల కలతలిక మాకేల "ఏడేడు"
ఇలవేల్పు మా సాయి ఈ జన్మకిది చాలు "ముడి"
చ. ఆడేటి ఈ గుండె యే క్షణము ఆగునో
పాడేటి నా గొంతు రాగాలు మారునో "ఆడేటి"
నాకేల నీ లీల తెలుసులే శ్రీ సాయి "నాకేల"
బాధలను తీర్చేటి బాబావు నీవే "బాధ" "ముడి"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి