శ్రీ షిరిడీ సాయిబాబా గారి "ధూప్ ఆరతి" లేదా సాయంకాల ఆరతియైన "ఆరతి సాయి బాబా సౌఖ్య దాతార జీవ" రచించినది శ్రీ మాధవరావ్ వామన రావ్ అద్కర్. ఈ ఆరతిని సాయంకాలమున సుమారు 6 గంటల 15 నిముషాలకు షిరిడీలో ఇస్తారు. మరాఠీ లో రచించబడిన ఈ ఆరతి కి తెలుగు అనువాదం దిగువన ఇస్తున్నాను. ఇందులో ఏదైనా భావము సరిగ్గా ప్రస్ఫుతించ లేనిచో మీ సలహాలను తెలుపగలరు. ఇది సాయి సందేశాన్ని పదుగురు సాయి భక్తులతో పంచుకునే ప్రయత్నం గా గమనించ గలరు.
ఆరతి సాయి బాబా, సౌఖ్య దాతార జీవ చరణా రాజాతాళీ
ధ్యావా దాసాన్ విసావా, భక్తా విసావా ఆరతి సాయి బాబా
జాళుని యానంగా స్వ స్వరూపీ రాహే దంగా
ముముక్షు జన దావీ నిజ డోలా శ్రీరంగ, డోలా శ్రీరంగ
ఆరతి సాయి బాబా
జయా మనీ జైసా భావ, తయా తైసా అనుభవ
దావిసీ దయాఘనా, ఐసీ తుఝీ హీ మావా, తుఝీ హీ మావా,
తుమచే నామ ధ్యాతా, హరే సంస్కృతి వ్యథా
అగాధ తవ కరణీ, మార్గ దావిసీ అనాథ, దావిసీ అనాథ,
ఆరతి సాయి బాబా
కలియుగీ అవతార సద్గుణ పరబ్రహ్మ సాచారా
అవతీర్ణ ఝాలాసే, స్వామి దత్తా దిగంబర, దత్తా దిగంబర,
ఆరతి సాయి బాబా
ఆఠా దివాసా గురువారీ, భక్త కరీతి వారీ,
ప్రభుపద పహావాయా భవభయ నివారీ,
ఆరతి సాయి బాబా
మాఝా నిజ ద్రవ్యఠేవ, తవ చరణరజ సేవ
మాగణే హేచి ఆతా తుమ్హా దేవాది దేవా, దేవాది దేవా,
ఆరతి సాయి బాబా
ఇచ్చితా దీన చాతక నిర్మల తోయ నిజ సూఖ
పాజవే మాధవాయ సంభళ అపూళిభాక, అపూళిభాక
ఆరతి సాయి బాబా
ఆరతి సాయి బాబా, సౌఖ్య దాతార జీవ చరణా రాజాతాళీ
ధ్యావా దాసాన్ విసావా, భక్తా విసావా ఆరతి సాయి బాబా
బాబా నీకు ఆరతి చేస్తున్నాము. జీవులందరికీ సంతోషము నొసగి, నీ పాద రేణువులైన భక్తులకు నీ పాదముల వద్ద శరణు నిచ్చే నీకు ఆరతి చేస్తున్నాము.
జాళుని యానంగా స్వ స్వరూపీ రాహే దంగా
ముముక్షు జన దావీ నిజ డోలా శ్రీరంగ, డోలా శ్రీరంగ
ఆరతి సాయి బాబా
కోరికలను దహింప జేసి, తనను తాను తెలుసుకొన గోరే వారికి, మోక్షమును పొందే మార్గము బోధించి, తమ కళ్ళతో తాము విష్ణువుని (శ్రీరంగని) చూడ గలిగెట్లు చేసిన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
జయా మనీ జైసా భావ, తయా తైసా అనుభవ
దావిసీ దయాఘనా, ఐసీ తుఝీ హీ మావా, తుఝీ హీ మావా,
ఆరతి సాయి బాబా
ఎవరెవరికెంత నమ్మకము, భక్తి ఉన్నదో, వారికి దానికి తగినంత అనుభవాన్ని ప్రసాదించే, ఓ దయామయా నీవు చూపే మార్గము అదే ఓ దయామయా, నీకు ఆరతి చేస్తున్నాము. (దీనికి సామ్యం గా అన్నమాచార్యులు కూడా ఇలా చెప్పారు: "ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమె నీవు, అంతరాంతరము లెంచి చూడ పిందంటే నిప్పటి అన్నట్లు" అని.)
తుమచే నామ ధ్యాతా, హరే సంస్కృతి వ్యథా
అగాధ తవ కరణీ, మార్గ దావిసీ అనాథ, దావిసీ అనాథ,
ఆరతి సాయి బాబా
నీ నామ స్మరణము ఈతి బాధలను హరిస్తుంది. నీ చర్యలు అగాధమంత లోతైనవి (అంతు పట్టనివి). అవి అనాథలకు దారి చూపుతాయి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
కలియుగీ అవతార సద్గుణ పరబ్రహ్మ సాచారా
అవతీర్ణ ఝాలాసే, స్వామి దత్తా దిగంబర, దత్తా దిగంబర,
ఆరతి సాయి బాబా
ఈ కలియుగంలో నీవు భూమిపైకి దిగి వచ్చిన నిజమైన పరబ్రహ్మ అవతారానివి. నీవు దిగంబరుడైన దత్తాత్రేయ అవతారానివి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము. (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి పత్నియైన అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి మూడు తలలు గల దత్తాత్రేయునిగా జన్మించాడు)
ఆఠా దివాసా గురువారీ, భక్త కరీతి వారీ,
ప్రభుపద పహావాయా భవభయ నివారీ,
ఆరతి సాయి బాబా
ప్రతి గురు వారం భక్తులు షిరిడీ వచ్చి ఈ ప్రభువు చరణములను దర్శించుకుని, తమ ఇహలోక భయమును పోగొట్టు కొందురు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
మాఝా నిజ ద్రవ్యఠేవ, తవ చరణరజ సేవ
మాగణే హేచి ఆతా తుమ్హా దేవాది దేవా, దేవాది దేవా,
ఆరతి సాయి బాబా
నాకు కావలసిన సంపద అంతా నీ పాద సేవ చేయడమే. ఓ! ప్రభువులకు ప్రభువైన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
ఇచ్చితా దీన చాతక నిర్మల తోయ నిజ సూఖ
పాజవే మాధవాయ సంభళ అపూళిభాక, అపూళిభాక
ఆరతి సాయి బాబా
చాతక పక్షి ఎలా అయితే నిర్మలమైన నీరు త్రాగాలను కుంటుందో, ఓ! ప్రభూ, నాకు జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ప్రసాదించు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
చాలా బాగుందండి మీ బ్లాగ్
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ ని ఆధ్యాత్మిక విభాగం లో చేర్చుకున్నాం
ధన్యవాదాలు
http://www.sankalini.org/p/blog-page_16.html
అప్పారావు శాస్త్రి గారికి నమస్సులు. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞుడ్ని. మీ సంకలినిలో నా బ్లాగు చేర్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి